శ్రీరస్తు • శుభమస్తు • శ్రీ విఘ్నేశ్వర ప్రసన్నః

శ్రీ మహా త్రిపుర సుందరీ సమేత చంద్రమౌళీశ్వరస్వామి వారి అనుజ్ఞ గణపతి దేవస్థానము

శాంతి, ఐశ్వర్యం మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సును ప్రసాదించే పవిత్ర స్థలం.

🕉 శ్రీరస్తు • శుభమస్తు 🕉
కాంచీ శ్రీ శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారిచే నామకరణం చేయబడిన

శ్రీ మహా త్రిపుర సుందరీ సమేత చంద్రమౌళీశ్వరస్వామి వారి అనుజ్ఞ గణపతి దేవస్థానము

📍 పేరేచర్ల గ్రామం, మేడికొండూరు మండలం, గుంటూరు జిల్లా.
🏛️ నూతన ఆలయ శంకుస్థాపన మహోత్సవ ఆహ్వాన పత్రిక
భక్త మహాశయులారా !

స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సర మాఘ శుద్ధ దశమి సోమవారం మృగశిర నక్షత్రయుక్త మేషలగ్న పుష్కరాంశమున తేది 19-02-2024 ఉదయం 10-39 నిమిషములకు గుంటూరు జిల్లా, మేడికొండూరు మండలం, పేరేచర్ల గ్రామంలో శ్రీ మహా త్రిపుర సుందరీ సమేత చంద్రమౌళీశ్వరస్వామి వారి అనుజ్ఞ గణపతి దేవస్థాన నూతన ఆలయ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడినది.

📅 శంకుస్థాపన పూజా కార్యక్రమముల పట్టిక

ఉదయం 6:45 నిమిషములకు
గణపతి పూజ & పుణ్యాహవాచనము

మంగళ వాద్యములతో ఆలయ ప్రాంగణంలో గణపతి పూజ, స్వస్తివాచనములు.

ఉదయం 11:05 నిమిషములకు
తీర్థ ప్రసాద వితరణ

శైవాగమ పండిత ఆశీర్వచనములు మరియు భక్తులకు మహా ప్రసాద వితరణ.

శైవాగమ పండిత రత్న • ఆలయ ప్రధాన శైవాగమ ఆచార్యులు
శైవాగమ ఆచార్య బ్రహ్మశ్రీ మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్ శివాచార్య

"కావున భక్తజనులందరూ ఈ దివ్య శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొని, స్వామివార్ల కృపాకటాక్ష వీక్షణములు పొంది తరించవలసిందిగా కోరడమైనది."

Om Namah Shivaya Tap to play